Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు....జిల్లాలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీపీఐ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా అధి కారులకు విన్నవించినా, అధికారులు, ప్రభుత్వం స్పందించడం కరువైందని విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ భూములు భూ కబ్జాదారులు కబ్జాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదలు సీపీఐ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకుంటే నాయకులపై పెట్టిన అక్రమ కేసులు బనాయి స్తున్నారని ఆయన విమర్శించారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించడానికి పేదలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రామస్వామి, ఎం. ప్రభు లింగం,సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్, బీకెఎంయూ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్, మండల ఏఐటీయూసీ అధ్యక్షుడు శివ, గీత పనివాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, గ్రామ కార్యదర్శులు సత్తయ్య, బల్వంత్ రెడ్డి, వినోద తదితరులు పాల్గొన్నారు.