Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) రాజారత్నం
నవతెలంగా- కొత్తూరు
చిరుధాన్యాలలో పోషకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయ సంచాలకులు (ఏడిఏ) రాజరత్నం అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య దినోత్సవ వేడుకలు మంగళవారం మండలంలోని తిమ్మాపూర్, ఇముల్ నర్వ రైతు వేదికలలో మండల వ్యవసాయ అధికారి గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సదస్సులో చిరుధాన్యాల పంటలు సాగు విధానం పై రైతులకు అవగాహన కల్పించారు. ఇముల్ నర్వ రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి ఏడిఏ రాజరత్నం హాజరై, మాట్లాడుతూ... చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులకు తగిన సూచనలను సలహాలను అందించారు. చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు వంటి పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. చిరుధాన్యాలు నీటి ఎద్దడిని తట్టు కుంటుందని, చీడపురుగుల బెడద తక్కువగా ఉంటుందని తెలిపారు. పంట సాగు చేయడానికి తక్కువ ఖర్చుతో పాటు దిగుబడి ఎనిమిది నుండి పది క్వింటాళ్ల వరకు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజరు నాయక్, ఉపసర్పంచ్ శ్రీరాములు యాదవ్, లింగం నాయక్, మండల రైతు బంధు కోఆర్డినేటర్ మెండే కృష్ణ యాదవ్, రైతుబంధు కోఆర్డినేటర్ ఇంద్రసేనారెడ్డి, జామకాయల కృష్ణయ్య, శేఖర్, భీమయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు దీపిక, అనిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.