Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సిలివేరు రాజు
నవతెలంగాణ-మంచాల
కాగజ్ ఘాట్ గ్రామంలోనీ లావునీ భూములకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సిలివేరు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం కాగజ్ఘాట్ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ అనితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాగజ్ ఘాట్ గ్రామంలో గత 50 ఏండ్ల నుంచి పేదలు ఆ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని,ఆ భూముల రికార్డుల్లో వీరి పేర్లు ఉన్నాయని అన్నారు. పాత పాసు పుస్తకాలు కూడా ఉన్నాయనీ,కానీ ధరణి పోర్టల్ వచ్చిన తరువాత వీరి పేర్లను తారు మారు చేసినట్టు తెలి పారు.ఆ రైతులకు నేటికి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదన్నారు. దీంతో వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథ కాలు అందడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్ఘాట్ సీపీఐ(ఎం) మాజీ గ్రామ కార్యదర్శి యాట వెంకటేష్, డీవైఎఫ్ఐ మండలాధ్యక్షులు దేవరకొండ రామకృష్ణ, కార్యదర్శి ఆర్.స్వామి పాల్గొన్నారు.