Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రగతి నివేదన యాత్ర' మరింత బాధ్యత పెంచింది
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-యాచారం
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందించేందుకు తాను కృషి చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని గున్గల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో ప్రగతి నివేదన యాత్ర కొనసాగి రాత్రి ముగిసింది. దాదాపు మండలంలో 22న నంది వనపర్తిలో ప్రారంభమై 31వ తేదీన గడ్డ మల్లయ్య గూడలో ముగిసింది. 19 గ్రామాలు, మూడు తండాలు, 149 కిలోమీటర్లు ప్రగతి నివేదన యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి నివేదన యాత్ర ద్వారా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు సాను కూలంగా తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఏ గ్రామంలో అడిగినా డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలని పేద లంతా అడిగుతున్నారని చెప్పారు. ఈ యాత్ర ద్వారా ప్రతి గడపనూ తట్టి వారి సాధకబాధలు తాను తెలుసుకున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో మాట్లాడి గ్రామాలకు కావలసిన నిధులను కూడా మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ యాత్రలో తనను ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి నివేదన యాత్ర ద్వారా యాచారం మండలంలో వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం పని చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య, పార్టీ మండల అధ్యక్షులు కర్నాటి రమేష్‌గౌడ్, పీఎసీఎస్ చైర్మెన్ తోటిరెడ్డి రాజేందర్ రడ్డి, సర్పంచులు కాశమల్ల ఇందిరా, కంబాలపల్లి ఉదయ్ శ్రీ, ఎండి హబీబుద్దిన్, చిగురంత శ్రీనివాసరెడ్డి, కంబాలపల్లి సంతోష, ఎంపీటీసీలు మొరుగు శివలీల, డేరంగుల శారద, సుమలతమ్మ, ఉప సర్పంచులు గోవర్ధన్ రెడ్డి, భీమ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేష్, శంకర్ నాయక్, పీఎసీఎస్ డైరెక్టర్లు, నాయకులు బిలకంటి శేఖర్ రెడ్డి, రాజు నాయక్, యాదయ్యగౌడ్, గొరిగే జంగయ్య, అచ్చన దానయ్య, కొల్లం అనంతరెడ్డి, పాల్గొన్నారు.