Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
నవతెలంగాణ-షాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హైతాబాద్లో కన్సర్న్ ఇండియా వారి సహాకారంతో నిర్మించిన ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు ఏలా జరుగుతుందని అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అవసరమైనవారికి కండ్ల అద్దాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డిప్యూటీ డిఎంహెచో దామోదర్, గ్రామ సర్పంచ్ మల్లేష్, మండల వైద్యాధికారులు ఉన్నారు.