Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి పి.అనిల్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జంతు సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి పి.అనిల్ కుమార్ అన్నారు. జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సం రక్షణ పక్షోత్సవాలు ఈ నెల 14 నుంచి 31 వరకు వికారా బాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ముగింపు కార్యక్రమాన్ని జెడ్పీహెచ్ఎస్ కొత్తగడి వికా రాబాద్ పాఠశాలలో నిర్వహిస్తామని తెలిపా రు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు హేమలత, కొత్తగడి పశు వైధ్యాధికారిని డా.ఉష ఆధ్వర్యంలో పాఠశాల విద్యా ర్థులందిరికీ జంతు సంక్షేమం, సంరక్షణపై అవగాహనా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జంతు సంరక్షణ, సంక్షేమంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య కార్యాలయ సహాయ సం చలకులు డా.పి.ప్రహ్లాద్ విద్యార్థులకు జంతుల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల కరుణ, దయ కలిగి ఉండి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ జంతు సంర క్షణ చట్టాలు, జిల్లా జంతు సంరక్షణ సంస్థ, రాష్ట్ర జంతు సంరక్షణ సంస్థల విధులు తెలిపారు. జంతు సంరక్షణ చేయు స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం కొత్తగడి వార్డు-1లో విద్యార్థులు, పుర పౌరులు, పాఠశాల అధ్యాపకులు, శాఖ సిబ్బందితో నినాదా లు, ప్లే కార్డులు చేత బూని ర్యాలీ నిర్వహించారు. ప్రజల కు జంతు సంరక్షణ,సంక్షేమంపై అవగాహన కల్పించారు.