Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
పారిశుధ్య కార్మికులకు రూ.24 వేల జీతం ఇవ్వాలని, వారిని పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో రాజేంద్రనగర్ సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున పారిశ ధ్య కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. తొలగించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పెంచిన వేతనాలు అమలు చేయాలన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ నాయకులు టి.ఆనంద్, ఏ.సాయిలు, రాజు పాల్గొన్నారు.