Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి అమీర్‌పేట మల్లేష్
- మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-యాచారం
రెండో విడత గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నగదు బదిలీని ప్రారంభించాలని జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమీర్‌పేట మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జీఎంపీఎస్ యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలకు, మేకలకు సీజనల్లో వచ్చే వ్యాధులకు సంబంధించి ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేయాలని కోరారు. ఫారెస్ట్ భూముల్లో గండ్లను తొలగించి మేతకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. గొర్రెలు దొంగతనం జరగకుండా పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చదువుకున్న గొర్ల కాపరులకు షెడ్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.30 లక్షలను సబ్సిడీ రూపంలో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీలో ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదును జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అచ్చన రమేష్, సహాయ కార్యదర్శి బర్ల మల్లేష్, నాయకుడు మైసయ్య, సత్యనారాయణ, నక్క మహేందర్, బైకని పాండు, తదితరులు పాల్గొన్నారు.