Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బండిమీది కృష్ణమాదిగ
నవతెలంగాణ-యాచారం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన యుడు బంటి పైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు, మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణమాదిగ హెచ్చరిం చారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న సాయిశరణం గార్డెన్లో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డమల్లయగూడలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదాన్ని బీజేపీ,కాంగ్రెస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా రని విమర్శించారు. ప్రగతి నివేదన యాత్రతో ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి కొంతమంది నాయ కులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రగతి నివేదన యాత్రకు, ట్రాక్టర్ ప్రమాదానికి ఏమన్నా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. బంటి పైన విమర్శలు చేయడం మానుకోవాలని విపక్ష నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కల్లూరి శివకుమార్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మండలి గోపాల్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పోలే మహేష్, నియోజకవర్గ కోశాధికారి అచ్చన దానయ్య, తలారి సంపత్ కుమార్, శివ, వంశీ, సాయికుమార్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.