Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో అధునా తన పద్ధతులు పాటించాలని సీడ్ వర్క్స్ సీఈవో వెంకట్ రామ్, కళాశాల డైరెక్టర్ మాలతి, మాజీ ఐఏఎస్ రాంపు ల్లారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఊ రెళ్ళ గ్రామ శివారులోని సాగర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వ్యవసాయ వ్యాపారం, గ్రామీణ నిర్వహణలో నూతన పోక డలు అధునాత పద్ధతులు అనే అంశంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ రం గంలో వ్యవసాయ ఆధార వాణిజ్య రంగంలో వస్తున్న మా ర్పులు, ముఖ్యంగా టెక్నాలజీ వాడకం, విలువ ఆధారిత పరిశ్రమల గురించి లోతైన విశ్లేషణ జరిగినది. అలాగే కోవిడ్-19 తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు గ్రామీణ రంగంలో వచ్చిన మార్పులు గురించి (వ్యతిరేఖ వలసల వలన చర్చించడం జరిగినది. కోవిడ్ తర్వాత వ్వవసాయ రంగంలో సాంకేతికత వినియోగం చాలా జరిగినది. అలాగే డ్రోన్స్ వినియోగం పెరిగినది. ఈ మార్పులకు ప్రభుత్వ సహకారం కూడా ఒక కారణమని తెలిపారు. ఇక పంట ఉత్పత్తి జరిగిన తర్వాత జరిగే విలువ జతపరిచే చర్యలలో కూడా సాంకేతికత వినియోగం పెరి గినది. రైతులను మార్కెట్లకు అనుసందానం చేయడంలో సాంకేతిక ప్రాముఖ్యతను కూడా ఈ సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సురేష్, సాహు డీన్, నిర్వాహకులు రామ్ నరేష్, మైపాల్‌రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.