Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
పేదలకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల సాధన కోసం ప్రజా సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, అవాజ్ సంఘం ఆధ్వర్యంలో పరిగి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య మాట్లాడుతూ పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో 9.39 గుంటల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వా లని అన్నారు. గతంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేస్తే పోలీసులు, అధికారులు తొలిగించారని గుర్తు చేశారు. కోర్టు కేసు పేరుతో కాలయాపన చేయడం తగదని అన్నారు. నేటికీ ఇంకా పేదలకు ఇంటి స్థలాల సమస్యను అధికారులు పరిష్కరించలేదన్నారు. వెంటనే రంగాపూర్ ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ భూములలో 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, సొంత ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీస్, అవాజ్ సంఘం నాయకులు ఎండీ హబీబ్, సీఎV్‌ా సత్యయ్య, రఘురామ్, శ్రీనివాస్, లాలయ్య, వెంకటయ్య, శంకర్, సురేష్, చంద్రయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.