Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండ్లగూడ మేయర్ మహేందర్‌గౌడ్
జలమండలి, మున్సిపల్ అధికారులతో సమావేశం
నవతెలంగాణ-గండిపేట్
అభివృద్ధితోపాటు నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ బుర్ర మహేందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఛాంబర్లో జలమండలి, మున్సిపల్ అధికారు లతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన వాటర్లైన్లు, ఇంటర్నల్ లైన్లు, జంక్షన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి వార్డు, 14వ వార్డులో జన్నారంలో కొత్తగా నీటి పైప్లైన్లు పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరా లేని వారు కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పైపు లైన్లు వేసిన తర్వాతే సీసీరోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రోడ్డు పనును పూర్తిగా నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్ డీఈ యాదయ్య, ఏఈ రాజీవ్‌రెడ్డి, వర్క్ఇన్స్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.