Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నరెడ్డిగూడ సర్పంచ్ ఆంబోతు కిషన్‌నాయక్, పీఏసీఎస్ డైరక్టర్
జెనిగా వెంకటేష్
నవతెలంగాణ-మంచాల
నిరుద్యోగులు బ్యాంకు రుణాలను సద్వినియోగిం చుకోవాలని చెన్నరెడ్డిగూడ సర్పంచ్ ఆంబోతు కిషన్‌నాయక్, పీఏసీఎస్ డైరక్టర్ జేనిగా వెంకటేష్ అన్నారు. శుక్ర వారం మండల పరిధిలోని చెన్నరెడ్డిగూడ గ్రామంలో నలుగురు యువకులకు ఎస్బీఐ ఆరుట్ల బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలి బగ్గరాములు, శివ శంకర్, బండారి వెంకటేష్, ఎర్ర మోని మహేష్‌లకు ఒక్కొక్కరి రూ.10 లక్షల చొప్పున గేదెల పెంపకం కోసం మొత్తం రూ.40 లక్షల చెక్కులను అందజేసినట్టు తెలిపారు.