Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ఏసీపీ కేంద్రంగా నార్సింగి మారడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఏసీపీ రమణగౌడ్‌ను సన్మానించా రు. శుక్రవారం నార్సింగి ఏసీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, గండిపేట్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు క్యాతం అశోక్‌యాదవ్, కాంగ్రెస్ దళిత సెల్ ఉపాధ్యక్షులు దుడ్డు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏసీపీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నార్సింగికి కొత్తగా ఏసీపీ కేంద్రం రావడం సంతోషంగా ఉందన్నారు. భద్రతా విషయంలో పోలీసులు మరింత పటిష్టం చేసేందుకు ఏర్పడుతుందన్నారు. ఏసీపీ రమణగౌడ్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ శివకుమార్, డైరెక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి, హరిశంకర్, రాష్ట్ర నాయకులు కిరణ్‌కుమార్, కౌన్సిలర్ దుర్గేష్, కాంగ్రెస్ నాయకులు వినోద్‌కుమార్, జల్లివేంకటేష్, రాము, ప్రభు, శ్రావన్‌కుమార్, జమీల్, మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.