Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-మియాపూర్
శేర్లింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూము లను కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మా ణాలు చేపడుతున్న కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య అన్నారు. శేర్లింగంపల్లి మండల కౌన్సిల్ సమా వేశం మాదాపూర్ డివిజన్లో ఇసత్నగర్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడు తూ శేర్లింగంపల్లి మండల పరిధిలో ఉన్న భూములకు కోట్ల విలువ వస్తున్నందున భూ కబ్జాదారుల ప్రభుత్వ భూమి లను గుర్తించి వాటిని ఆక్రమించుకొని కబ్జాలు చేస్తూ బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆయ న తెలిపారు. వారికి సపోర్టు చేస్తూ అక్రమాలకు పాల్ప డుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేయించి, పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, మండల కార్యదర్శి టి.రామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు కే.చంద్రయాదవ్, వెంకటస్వామి, కాసిం, జెట్టి శ్రీనివాస్, కృష్ణ, ఎస్.నరసమ్మ, కే.సుధాకర్, ఎం. వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.