Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్‌రెడ్డి
నిరాహార దీక్షకు పలువురి మద్దతు
నవతెలంగాణ-యాచారం
దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయా లని ఇబ్రహీంపట్నం టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో కిసాన్ ఆగ్రో ఫీడ్స్ కంపెనీని మూసివేయాలని గ్రామస్తులు చేస్తున్న నిరాహార దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ ఆగ్రో ఫిడ్స్ పేరుతో ఉన్న కంపెనీని ప్రభుత్వం రద్దు చేయాలని అన్నారు. ఈ కంపెనీ చుట్టుపక్కల ప్రతిరోజూ వచ్చే దుర్వాసనతో జనం భరిం చలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా చనిపోయిన పశువుల వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచి కల్తీ నూనె, డాల్డా, నెయ్యి, ఇతర పదార్థాలను తయారు చేస్తు న్నారని గుర్తు చేశారు. ఈ కంపెనీలో కూ లిన మాంసాన్ని నిల్వ ఉంచడం ద్వారా దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు. కంపెనీ చుట్టు పక్కల వ్యవసాయ రైతులు ఈ వాసనను తట్టుకోలేక రోగాల పాలవుతున్నారని విమర్శిం చారు. దీని చుట్టుపక్కల ఉండే గ్రామాలు తక్కలపల్లి, కొత్తపల్లి, చింతపట్ల, తండాలు, తమ్మలోనిగూడ ప్రజలు రోగాల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చిక్కుడు గుండా లు, కొత్తపల్లి ఉప సర్పంచ్ కావాలి జగన్, గుండ్ల వెంకట్‌రెడ్డి, దేంది రాంరెడ్డి, జంగయ్య, సత్యం, శ్రీకాంత్, రాజేందర్‌రెడ్డి, విప్లవకుమార్, తదితరులు పాల్గొన్నారు.