Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామేల్
- పేదలందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి
- ఇంటి స్థలం ఉన్నోల్లకు రూ. 5లక్షలు ఇవ్వాలి
- ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇంటి స్థలాలు ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడ ిసెలు వేస్తామని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బోడ సామేల్ హెచ్చరించారు. అందరికీ డబల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల ఇవ్వాలని కోరారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనం తరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో సొంత ఇల్లు లేక 25 ఏండ్ల నుంచి అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్న పేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసొప్పడం లేదని ప్రశ్నించారు. ఆ భూములన్నీ ఇతర కబ్జాదారుల కబం ధహస్తాల్లో చిక్కుకున్నాయని చెప్పారు. కానీ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదన్నారు. ఎక్కడైనా పేదలు 60 గజాల స్థలం కో సం ఆక్రమించే గుడిసెలు వేస్తే మాత్రం బహుళ స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్య ఇండ్లను ఖాళీ చేయడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేసిన గుడిసెలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇల్లు లేని పేదలందిరికీ డబుల్ బెడ్రూం ఇండ్లుకట్టించి ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రలోభాలు పెట్టిందన్నారు. కానీ నేటికీ ఈ ప్రాంతంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదని చెప్పారు. ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యిందని, తప్ప ఆచరణలో అమలు చేయలేకపోయిం దన్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వెంటనే ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5లక్షలు ఇవ్వాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ఖాల్సా సర్వే నెంబర్ 2లో భూధాన్ బోర్డు 10 ఎకరాల భూమిని ఇంటి స్థలాలకు కేటాయించి ఎండ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికైనా ఇండ్లు ఇవ్వాల న్నారు. లేని పక్షంలో వినోబానగర్ లో గుడిసెలు వేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ చింతపట్ల ఎల్లేశ, జిల్లా సహాయ కార్యదర్శి యెలామోని స్వ ప్న, రైతు సంఘం మండల కార్య దర్శి ముసలయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మంకాల విజయమ్మ, మత్య కార్మిక సంగం జిల్లా అధ్యక్షులు చినమోని శంకర్, మండల కన్వీనర్ బుగ్గరాములు, యాదగిరి, దశ రథ, మ హిళా సంఘం మండల అధ్యక్షురాలు దేవర కొండా ఇంద్ర, యాచార మండలం మహిళా సంఘం అధ్యక్షురాలు మస్కుఅరుణ, పెరుమండ్ల ఉమా, ఎర్పుల వీరేశం, మల్లెల నర్సిం హ, డోంకి నర్సింహా, కిషన్, పద్మ, యాదమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు.