Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకులు ఇతరుల మాటలు నమ్మి రెచ్చిపోవద్దు
- కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదు
- దేవనూరు కేసులో మురళీకృష్ణగౌడ్‌తో పాటు 5గురి అరెస్టు, రిమాండ్
తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
నవతెలంగాణ-తాండూరు
సమాజంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 'యాలాల మండల పరిధిలోని దేవనూర్ గ్రామంలో జనవరి 30వ తేదీన రాత్రి జరిగిన ఘటనలో ఎస్సీ వర్గం యువకులు, బీసీ వర్గం యువకులకు మధ్య జరిగిన సంఘటన గురించి నరేందర్ 31వ తేదీన యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న క్రమంలో కొంతమంది దేవనూరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు పన్నెండు గంటలు గడవకముందే ఇతర గ్రామస్తులైన శివ స్వాములకు చెప్పి అమాయ కులైన కొంతమందిని ప్రేరేపించి లక్ష్మీనారా యణపూర్ చౌరస్తాలో ధర్నా చేయించారు. ఈ ధర్నా వద్దకు వచ్చి ఒక వ్యక్తి మురళీకృష్ణగౌడ్ దేవనూరు యువకులకు నేరం చేయాలనే దిశగా ప్రేరేపించారుఉ. వారు రెచ్చిపోయి యాలలలో పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న మెట్ల నరేష్‌పై దాడి చేశారు. ఈ కేసులో నరేందర్, నరేందర్‌గౌడ్, అరవింద్‌గౌడ్, శివకుమార్, గణేష్‌లను మురళీ కృష్ణగౌడ్ ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చి విచారించారు. ఈ ఇట్టి ఘటనకు పూర్తిగా మురళీకృష్ణగౌడ్ అని దేవనూరు గ్రామ యువకులు తెలిపారు. ఈ కేసులో మురళి కృష్ణగౌడ్‌ను కూడా అరెస్టు చేసి తాండూర్ మెజిస్టేషన్ ఎదుట హాజరుపరిచారు. అదేవిధంగా ఐదు మంది యువకులను అరెస్టు చేసి పరిగి జైలుకు పంపించారు. ఈ కేసులో కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కొరకు తెలియని యువకులతో నేర్పించి కులాలు మతాలు మధ్య విద్వేషాలు ప్రేరేపించి గొడవలు సృష్టిస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలాంటి వ్యక్తులతో గ్రామస్తులు, ముఖ్యంగా యువకులు జాగ్రత్తగా ఉండాలి' అని డీఎస్పీ సూచించారు.