Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్న తనను గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి కోరారు. శుక్రవారం పలు పాఠశాలల్లో ఆయన ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరం తరం పోరాడుతున్నామని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలపై శాసనమండలిలో గ ళం విప్పుతానని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సంఘం జిల్లా అధ్యక్షులు సి హెచ్ వెంకట్రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు, తాండూర్, యాలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు, నారాయణ, వెంకటప్ప, భాను చైతన్య, రమేష్, ప్రకాష్, జిల్లా నాయకులు యాదవరెడ్డి, మధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.