Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్
నవతెలంగాణ-మియాపూర్
ప్రజలపై మోపుతున్న విద్యుత్ చార్జీలను వెంటనే ఉప సంహరించుకోవాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ అన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఉపసం హరించుకోవాలని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యు త్ సబ్స్టేషన్ల ఎదుట బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్య క్రమం అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం మి యాపూర్ ఎదుట చేపట్టారు. సెక్షన్ అధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమానికి హాజరైన వనం సుధా కర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో కేంద్రం లోని బీజేపీతో కుమ్మక్కైన బీఆర్ఎస్ పెట్రోల్, డీజిల్ నిత్య వసర వస్తువుల ధరలు పెంచుతూ అనేక పన్నుల పేరుతో జీఎస్టీని సమర్థించి ప్రజల పైన ఆర్థిక భారాలు మోపుతూ వస్తుందని ఆరోపించారు. 2016 నుంచి 2023 వరకు 16.110/కోట్ల రూపాయల భారాన్ని పరోక్షంగా ప్రజల పైన మోపుతూ వచ్చిందన్నారు. 2023 నుంచి ప్రత్యక్షంగా 1600 నుండి 2000 కోట్ల రూపాయల భారాన్ని ఈఆర్సీ ద్వారా ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు అధిక ధరలతో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు పన్నుల పేరుతో జీఎస్టి వసూలు వీటన్నిటితో ప్రజ లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మునిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా ఏప్రిల్ ఒకటి నుంచి యూనిటీపై 30 పైసలు అదనంగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఏసీడీ చార్జీలను ఉపసవరించుకోవాలని, 2015 నుంచి డిస్కంలో ఉన్న 16.110 /కోట్ల రూపాయల లోటు ను ప్రజలపై మోపెందుకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి యూనిట్ పై 30 పైసలు పెంచే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనింగ్ కమిటీ సభ్యులు దశరథ్‌నాయక్, రాష్ట్ర నాయకురాలు కుంభం సుకన్య, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ వి.తుకారంనాయక్, శేర్లింగం పల్లి నియోజకవర్గం కన్వినింగ్ కమిటీసభ్యురాలు బి.విమ ల, జి.లావణ్య, నాయకులు టి.అనిల్‌కుమార్, పి.భాగ్యమ్మ, ఎల్.రాజు, కన్నశ్రీనివాస్, ఇసాక్, ఎం.రాణి, ధారలక్ష్మి, టి.పుష్పలత, ఎం.చందర్, కే.చొక్కం, బి. శ్రీలత, దేవేందర్, జంగయ్య, ఎల్లయ్య, నాగేష్, సుమలత, దుర్గభవాని, కే.లక్ష్మి పాల్గొన్నారు.