Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్
నవతెలంగాణ -చేవెళ్ల
ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించ కుండా విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం సరైంది కాదని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానా పురం రాజేష్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సం దర్భంగా విద్యారంగా సమస్యల గురించి నిరంతరం పో రాటం చేసే ప్రగతిశీలా ప్రజాస్వామ్య విద్యార్థి సంగం విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేయడాన్ని పీడీఎస్‌యూ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వం స మస్యలను పరిష్కరించి విద్యార్థులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని, పెరిగిన నిత్యావసర ధరల కనుగుణంగా హాస్టల్, మెస్‌చార్జీలు పెంచాలని, పెండిం గ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రూ.1500 నుంచి 5000కు పెంచాలన్నారు. నీళ్లు,నిధులు, నియామకాలు అనే కోణంలో పోరాడి సాధిం చుకున్న రాష్ట్రంలో విద్యార్థులకు ప్రత్యేకమైన స్థానాన్ని క ల్పించాల్సిన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపట్ల రాష్ట్ర ప్రభు త్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కోజ్జంకి జైపాల్, బొజ్జి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.