Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల జిల్లా నాయకులు
నవతెలంగాణ-తుర్కయాంజల్
ప్రభుత్వం ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామ న్న వాగ్దానాన్ని నేరవేర్చాలని ప్రజా సంఘాల జిల్లా నాయ కులు అన్నారు. ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమి టీ ఇచ్చిన పిలుపులో భాగంగా తుర్కయంజాల్ మున్సిపా లిటీలో ఉన్న ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం తుర్కయంజాల్ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసి సూపరింటెండెంట్ అమర జ్యోతికి మెమొరాం డం, దరఖాస్తులు అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా వచ్చిన ప్రజాసంఘాల పోరాట వేదిక రంగారెడ్డి జిల్లా నాయకులు, మంచాల మండల మాజీ జడ్పీటీసీ పగ డాల యాదయ్య మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలని, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు తట్టుకోవడానికి రూ.3 లక్షలు కాకుండా కనీసం రూ.5 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కిషన్ మా ట్లాడుతూ నిరుపేదలు కిరాయి కట్టుకోలేక ఏండ్లతరబడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఇలాంటి వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. తుర్క యంజాల్ మున్సిపల్ ప్రాంతంలోని అనేక మంది నిరు పేదలు ఇల్లు ఇండ్ల స్థలం లేక అత్యంత దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా వారిని ప్రభుత్వం గుర్తించి అర్జీ పెట్టు కున్న వారందరికీ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజా సంఘాల పోరాటా వేదిక ఆధ్వర్యంలో వందలాది మంది నిరుపేదలు దరఖాస్తులు పెట్టుకున్నారని వెంటనే ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారంద రికీ ఇండ్లు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌కారత్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుమలత, స్థానిక నాయకులు టీ, నర్సిం హ, ఐ.భాస్కర్, కె.వెంకట కృష్ణ, బి. శంకరయ్య, కొండి గా రి శంకర్, ఐ.కృష్ణ, మలాద్రి, రత్నమ్మ, శారదా, యాదగిరి, శివ ప్రసాద్‌గౌడ్, అజరుగౌడ్, ఆంజనేయులు, శ్రీను నాయక్, ఉమా, స్వప్న, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.