Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ-ఆమనగల్
అర్హులైన ప్రతి కుటుంబానికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆమనగల్ మం డల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ లబ్దిదారులు ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదవారికి రూ.3 లక్షలు ఇస్తామన్నా మా టలు నీటి మూటలుగా మారాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళు మంజూరు చేయాలని, ఖాలీ స్థలం ఉండి ఇల్లు నిర్మిం చుకునే వారికి వెంటనే రూ.5 లక్షలు మంజూరు చే యాలని ఆయన కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో లబ్ది దారులతో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ యం త్రాంగాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. అ నం తరం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ తహ సీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణా రెడ్డి, సీఐటీ యూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య, కేవీపీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పిప్పళ్ళ శివశంకర్, సీఐటీయూ మండల కన్వీ నర్ లాలునాయక్, మున్సిపాలిటీ రంగం జిల్లా నాయకురా లు హంసమ్మ, మండలాధ్యక్షుడు రవి, లబ్దిదారులు పద్మ, విజయ, యాదమ్మ, లక్ష్మమ్మ, మైసమ్మ, చిన్న, చిట్టిబాబు, జంగయ్య, కుమార్, శ్రీను, గోపాల్, నరసమ్మ, యాదయ్య, కృష్ణ, సాలమ్మ, భారతమ్మ పాల్గొన్నారు.