Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి. జగదీష్
నవతెలంగాణ- శంకర్పల్లి
శంకర్పల్లి పట్టణ కేంద్రంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి. జగదీష్ అ న్నారు. శుక్రవారం సీఐటీయూ, రైతు సంఘం, ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ నయూముద్దీన్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ మండల కేంద్రంలోన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టా లున్న వారందరికీ ఇండ్ల జాగాలు చూపించాలని లేకుంటే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. శంకర్పల్లి పట్టణ కేంద్రంలో చాలామంది పేదలకు గత ప్రభుత్వం ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారని అప్పటినుంచి ఇప్పటివరకు ఇండ్ల స్థలాలు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం వెంటనే సర్వేనెంబర్ 278లో పేదలందరికీ స్థలాలు ఇవ్వాలని అక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. గ తంలో ఇండ్ల పట్టాలు పొందినవారందరికీ డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి అలీ దేవేందర్, రైతు సంఘం జిల్లా నాయకులు మల్లారెడ్డి, శంకర్పల్లి పట్టణ నాయకులు మల్లేష్, తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.