Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితునికి అప్పజెప్పిన పోలీసులు
నవతెలంగాణ-మియాపూర్
పాస్పోర్టుతో పాటు విలువైన వస్తువులను బాధితునికి అప్పజెప్పి న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీ సులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు కనిపిం చింది. ఆ బ్యాగుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో చాలాసేపు గమ నించి ఆ బ్యాగును గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ విజరునాయక్, కానిస్టేబుల్ హనుమంతు తీసుకువచ్చారు. దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఒరి జినల్ పాస్‌పోర్టు, బ్యాంక్ అకౌంట్, చెక్ బుక్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఉద్యో గానికి కావాల్సిన అపాయిం ట్మెంట్ లెటర్ ఇతర ముఖ్యమైన వస్తువులు, బట్టలు అందులో ఉన్నాయి. వెంటనే గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ ఆ చెక్కుబుక్కుపై ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా ఆ బ్యాగు కర్నాటక గుల్బర్గాకు చెందిన హరి మోహన్ దాస్‌కు సంబంధించిందిగా గుర్తించారు. వెంటనే అ వ్యక్తికి సమాచారం ఇవ్వగా గచ్చిబౌలి చౌరస్తా దగ్గరికి వచ్చి ఆ బ్యాగును పోలీసుల వద్ద నుంచి తీసుకున్నాడు. పోలీసులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.