Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
- చిన్నతుండ్ల శాఖ కార్యదర్శిగా గోపిక శ్రీనివాస్
నవతెలంగాణ-యాచారం
అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని చిన్న తుండ్లలో పార్టీ గ్రామ శాఖ సమావేశం జరిగింది. అనంతరం పార్టీ గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా గోపిక శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ హాజరై మాట్లాడారు..
కొంతకాలంగా అసైన్డ్, సీలింగ్ రైతుల భూ సమస్యలు పరిష్కారం కాక సతమతమవు తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్య లను గుర్తించి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పేదలందరికీ సర్టిఫికెట్లు ఇచ్చిన ప్రకారం ఇంటి జాగాలు ఇవ్వాలని కోరారు. ధరణిలో భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులంతా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. పేదల సమస్యలను విస్మరి ంచిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధృతంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మధుసూదన్‌రెడ్డి, మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, గ్రామ శాఖ కార్యదర్శి మస్కు మహేందర్, మస్కు అరుణ, కుమార్, తదితరులు పాల్గొన్నారు.