Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో నిలిచేందుకు అధిష్టానం పావులు
- ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అధ్యక్షులు కాసాని
- జిల్లా నేతలతో పలుమార్లు మంతనాలు
- పక్క పార్టీల నేతల చూపులు టీడీపీ వైపు బలపడుతున్న బీసీ నినాదం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
2024 ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు సిద్ధమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ బరిలో సత్తా చాటేందుకు టీడీపీ కాలుదువ్వుతోంది. అందుకు బలమైన నేతలు తెరమీదకు వస్తున్నారు. ఆ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేయనున్నా రు. కాగా రెండు సామాజిక వర్గాలు ఆ పార్టీలో పోటీ పడున్నాయి. ఓసీతో పాటు, బీసీ అభ్యర్థులు కూడా తెరమీద కొస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా, రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవతెలంగాణ కథనం.
గత కొన్ని పర్యాయాలుగా ఇబ్రహీంపట్నం నియోజక వర్గం టీడీపీకి పెట్టనికోటగా వచ్చింది. అందుకు 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోత్తుతో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొండ్రు పుష్పలీల కాంగ్రెస్‌పై గెలుపొందారు. 2004 జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్ర రవికుమార్ బరిలో దిగారు. కాగా కాంగ్రెస్‌తో కూదుర్చుకున్న అవగాహనతో సీపీఐ(ఎం) అభ్యర్థి మస్కు నర్సింహా భారీ మెజార్టీతో గెలు పొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం) మద్దతు తో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించా రు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీస్తున్న తరుణం. ఈ తరుణంలోనూ బీజేపీ మద్దతుతో మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ రెబల్‌గా వచ్చిన స్వతంత్ర అభ్యర్థి మల్రెడ్డి రాంరెడ్డిపై 10వేల పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి క్యామ మల్లేష్ మూడో స్థానంలోనే నిలిచారు. సీపీఐ(ఎం), టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలు పోటీ చేశారు. ప్రతి ఒక్కరూ 10వేలపైగానే ఓట్లను సాధించారు. అందుకు టీడీపీలో బలమైన కార్యకర్తలతో పాటూ ఓటు బ్యాంకు కలిగి ఉండ డమే కారణంగా నియోజకవర్గం భావిస్తోంది. 2018లో మరోసారి కాంగ్రెస్ మద్దతుగా టీడీపీకి ఇబ్రహీంపట్నం స్థానాన్ని కేటాయించింది. ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డికి అవకాశం కల్పించారు. కాగా చివరి కంటా టికెట్ ఆశించిన క్యామ మల్లేష్, మల్రెడ్డి రంగారెడ్డికి మొండిచేయి లభించింది. మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా అభ్యర్థిగా బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేయగా, క్యామ మల్లేష్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకు న్నారు. అనూహ్య పరిణామాల రిత్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి 18వేల ఓట్ల వరకు సాధించారు.
టీడీపీకి సానుకూలమే...
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లో పోటీ పడుతున్నారు. వారికి స్వంత పార్టీలో టికెట్ రాని యేడలా టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందుకు ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసినట్టు సమాచారం. ఈ తరుణంలో పార్టీ అభ్యర్థి ఖచ్ఛితంగా పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎంపిక నియో జకవర్గ నేతలు చూస్తారా? రాష్ట్ర కేంద్రర చూడాలా అనే చర్చలు సాగినట్లు సమాచారం. ఆయా పార్టీలు, అభ్యర్థులు, ఓటు బ్యాంకు, ఇతర పార్టీలోని అసంతృప్తులను టీడీపీ తమవైపు మలుచుకునే ప్రయత్నం చేస్తుంది.
ఆశావహుల ఎదురు చూపులు..
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అనేక మంది టికెట్ తమకే వస్తుందని ఆశగా ఉన్నారు. తమకు పార్టీ నుంచి సంకేతాలున్నాయంటున్నారు. ఆ రెండు పార్టీల్లో టికెట్ ఆశించే నాయకులు ఇప్పటికే చావు, బతుకులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మరికొందరు సేవా కార్యక్రమా లు చేపడుతున్నారు. వారికి టికెట్ వస్తే ఒకే.. లేకుంటే టీ డీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసేందుకు కూడా ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాసానిని కలిసిన ట్టు సమాచారం. ఐతే అందులో పోటీ.. రాకుంటే ఇందులో పోటీ అన్నట్లుగా నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. అయితే పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్థన్‌రెడ్డిని పోటీ చేయాలని నియోజకవర్గ నేతలు కోరుతున్నారు. ఒకవేళ ఆయన పోటీ చేసేందుకు నిరాకరిస్తే.. బలమైన అభ్యర్థులే పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి.