Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేను కలిసిన కుత్బుద్దిన్గూడా గ్రామస్తులు
నవతెలంగాణ-మొయినాబాద్
గ్రామ పరిధిలో కబ్జాలకు గురైతున్న ప్రభుత్వ భూము లను కాపాడాలని కుత్ బుద్దీన్ గూడా గ్రామస్తులు సర్పంచ్ కుమ్మెర పద్మమ్మ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మమ్మ గ్రామస్తులు ఎమ్మెల్యేతో తమ గోడు విన్నవించుకున్నారు. మండలంలోని కుత్బుద్దిన్ గ్రామంలో 384 సర్వే నెంబర్ లో 16 ఎకరాల 35 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలలో గ్రామస్తుల సౌకర్యార్థం రోడ్లు, డంపింగ్‌యార్డ్, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటికక కేటాయించగా మిగిలిన 6 ఎకరాల భూ మిని ఖాళీగా ఉండటంతో గ్రామానికి సంబంధంలేని హైద రాబాద్‌కు చెందిన కొందరు కబ్జాకారులు ఆ ప్రభుత్వ భూ మిపై నకిలీ పత్రాలు సృష్టించి ఒకరిద్దరు గ్రామస్తులతో చేతులు కలిపి ప్రభుత్వ భూమి ఆక్రమణ చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. గతంలో కబ్జాకారులు నకిలీ పత్రాలు చూపి ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించగా సర్పంచ్‌తో కలిసి గ్రామస్తులు ఎదిరించడంతో కబ్జాకారు లు తమపై అక్రమ కేసులు పెడతామని బెదిరింపులు చేసి గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపా రు. ఎమ్మెల్యే గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూము లను కాపాడేందుకు కృషి చేయాలని గ్రామంలోని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు లేకపోవడంతో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు కోరారు. సమస్యపై ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందిస్తూ ప్రభుత్వ భూములను కాపాడాలని మండల తహసీల్దార్ అశోక్ కుమార్‌కి తెలిపారు. అక్ర మం గా ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గానికి చెందిన గ్రామ సర్పంచ్ పై అక్రమార్కులు కేసులు పెడతామని బెదిరించిన వారిపై కఠిన చర్యలుతీసుకు నేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు కుమ్మరి మైసయ్య, ఈశ్వ రయ్య, ఆలూరి రమేష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.