Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
వివిధ సందర్భాల్లో నిర్వహించే ఆటల పోటీలు యువతీయువకుల్లో స్నేహాభావాన్ని పెంపొందిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ అన్నారు. కడ్తాల్ మండలంలోని రేఖ్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో సంత్‌సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహి స్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం జడ్పీ టీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు జోగువీరయ్య, మండల సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ హరిచంద్‌నాయక్, మక్తమాధారం సర్పంచ్ ముద్వెంటి సులోచన సాయిలు, ఎంపీటీసీ సభ్యులు మంజుల చంద్రమౌళి, ప్రీయా రమేష్, బీఆర్ఎస్ తలకొండపల్లి మండల అధ్యక్షుడు కుమ్మరిశంకర్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.