Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవాలాల్ ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ నాయక్
- మల్లాపూర్ తండాలో గిరిజనుల సమావేశం
- ముఖ్యఅతిథులుగా హాజరైన సర్పంచ్ రవినాయక్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్
నవతెలంగాణ-కొత్తూరు
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్ జయం తిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని మల్లాపూర్ సేవాలాల్ ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ నాయక్ అన్నారు. మండలంలోని మల్లాపూర్ తండాలో ఆదివారం మండల గిరిజన నాయకులు సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని సమావేశమ య్యారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సర్పంచ్ రవి నాయక్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయ క్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ..సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆయనను గౌరవిం చాలని ప్రభుత్వాన్ని కోరారు. వెనుకబడి పోయిన గిరిజను లందరికి గిరిజనబంధు ప్రకటించి ఆదుకోవాలన్నారు. సే వాలాల్ జయంతి వేడుకలు మండలంలో ఘనంగా నిర్వ హిస్తామని అందుకు గిరిజన బిడ్డలందరూ తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దశరథ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణనాయక్, మోహన్ నాయక్, వార్డుమెంబర్ చందర్‌నాయక్, శంకర్, నర్సింగ్, రాజు, చందర్, నుర్య, రామునాయక్, వెంకటేష్ నాయక్, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.