Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
నవతెలంగాణ-మంచాల
సమ సమాజ నిర్మాణంలో యువకులు భాగస్వాము లు కావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అ న్నారు. ఆదివారం మండల కేంద్రంలోనీ కాచం కృష్ణమూ ర్తి భవన్లో డీవైఎఫ్ఐ మంచాల శిక్షణాతరగతులు జరి గాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, యువతను పట్టించుకునే నాథుడే లేడని యువకులు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వచ్చి దోపిడీ రాజకీయాలను మా ర్చాలన్నారు. డీవైఎఫ్ఐ పని చేసేది దోపిడీ లేని సమాజం కోసమని, సమ సమాజ నిర్మాణం కోసం పని చేస్తుందన్నా రు. యువకులు సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ నాయకులు పగడాల యాదయ్య, నాగిల్ల శ్యామ్ సుందర్, సీలివేరు రాజు, మండలాధ్యక్ష, కార్యదర్శులు దేవరకొండ రామకృష్ణ, రత్నావత్ స్వామి, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.