Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహా రాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ మంగళవారం గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.హన్మానాయక్ ఆధ్వర్యం లో పలువురు గిరిజన నాయకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గోర్ బంజారా ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో నిర్వహించే సీజన్ 5 జీబీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్లను సొసైటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ ఆవిష్కరించా రు. గిరిజన విద్యార్థి సేవా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామావత్ రవి రాథోడ్, బావాజీ రంగా నాయక్, బొట్టు వెంకట నాయక్, కొర్ర వీరేష్నాయక్ పాల్గొన్నారు.