Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) బండలేముర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు వినతి
- సానుకూలంగా స్పందించిన ఎండీ
నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం నుంచి బండలేముర్ మీదుగా నారాయణపురం వరకు ఆర్టీసీ బస్సును పునరుద్ధ్దరించా లని సీపీఐ(ఎం) బండలేముర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రం గారెడ్డి జిల్లా మంచాల మండల మండలం నుంచి యాదా ద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పార్లగడ్డ తండ రోడ్డు రెండు గ్రామాలకే గాక రెండు మండలాల్లో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించే విధంగా బస్సు ఉండేదన్నారు. మర్రిగూడ, ఇబ్రహీంపట్నం, మం చాల, యాచారం మండలాల్లో అనేక గిరిజన తండాలు బంధుత్వాలు ఉన్నాయని తెలిపారు. నిత్యం ఈ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. ఈ గ్రామాల కు అన్నింటికీ ప్రధాన లింకు రోడ్డుగా బండలేముర్, పార్లగడ్డరోడ్డు ఉందన్నారు. రెండు జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎంతో వీలుగా రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ రోడ్డు వెంబడి గతంలో బస్సు నడిచేదని తెలిపారు. ఆ రోడ్డు వర్షాలకు గుంతలమయం కావడంతో ఆర్టీసీ బస్సు నిలిపివేసినట్టు చెప్పారు. ఇటీవల కాలంలో ఆ రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం రూ.24 కేటాయించిందని తెలిపారు. రోడ్డుకు మరమ్మతులు కూడా చేసిందని చెప్పారు. ఇప్పుడు రోడ్డు గుండా బస్సు వెళ్లే డానికి అనువుగా ఉందన్నారు. కాబట్టి నారాణపురం బస్సు ను పునరుద్ధరించాలని కోరారు. దీనికి ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. త్వరలోనే బస్సును నడిపిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండలేముర్ మాజీ సర్పంచ్ పోచమొని కృష్ణ, మాజీ ఎంపీటీసీ వట్టి వెంకటేష్, సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి జోగు శ్రీనివాస్, జర్పుల కిషన్, వట్టి రాజు, తదితరులు పాల్గొన్నారు.