Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను పరిశీలించిన ఎంపీ రంజిత్‌రెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
వాకింగ్ సైకిల్ ట్రాక్‌ను ఇండియాలోనే నెంబర్‌గా చేస్తామని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం గండిపేట్ చెరువు కట్టపై ఉన్న పార్కును కోల్లూర్ నుంచి నార్సింగి వరకు ఓఆర్ఆర్ పక్కన ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్ ఏర్పాట్లు, పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోకాపేట్ నుంచి రూ.95 కోట్లతో ఔటర్ రింగ్ పక్క 4, 5 మీటర్ల వెడల్పు 23 కీలో మీటర్ల వరకు ప్రతిష్మాతకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. నానాక్‌రాం గూడ నుంచి టీఎస్‌సీఏ వరకు, నార్సింగి నుంచి కొల్లూర్ వరకు నిర్మాణ పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. గండిపేట్ చెరువు కట్ట చుట్టు త్వరలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గణేష్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్‌యాదవ్ సమస్యలను ఎంపీ రంజిత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గండిపేట్ నుంచి వెడల్పు చేయాలన్నారు. గండిపేట్ పార్కు వద్ద సమస్యలను వేంటనే పరిష్కరించా లని కోరారు. దీనికి ఎంపీ స్పందిస్తూ మంత్రి కేటీఆర్‌తో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గణేష్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.