Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజాభివృద్ధికి చదవనిద్దాం
- సీడీపీఓ లక్ష్మీబాయ్, కౌన్సిలర్ ఉషమ్మ
నవతెలంగాణ-గండిపేట్
ఆడబిడ్డలను పుట్టనిద్దాం-బతుకనిద్దాం, సమాజాభి వృద్ధికి చదవనిద్దామని శేరిలింగం పల్లి సీడీపీఓ లక్ష్మీబాయ్, కౌన్సిలర్ ఉషమ్మ అన్నారు. మంగళవారం నార్సింగి మున్సిపాలిటీ లోని 17 వార్డులో గల కమ్యూనిటీ హాల్లో నార్సింగి సెక్టార్ అంగన్వాడీ టీచర్లతో 'బేటీ బంఛావో- బేటీ బడావో' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలన్నారు. ఆడ బిడ్డల ఎదుగుదలకు పోషక ఆహారాన్ని అందించాలన్నారు. ఆడబిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాల న్నారు. సమాజా భివృద్ధిలో మహిళలే కీలకమన్నారు. చిన్నారుల ఎదుగుదలకు ఐసీడీఎస్ సేవలను సద్వినియో గం చేసుకోవాలన్నారు. కౌన్సిలర్ మాట్లాడుతూ అంగన్ వాడీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేయాలన్నారు. సొంతభవనాలను, అంగన్ వాడీ, ఆయాల పోస్టులను భర్తీ చేయాలన్నారు. మరుగు దొడ్లు, వంటి సామాగ్రి, ఫర్నిచర్లు అందించాలన్నారు. చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.