Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోకాపేటలో అరెకటిన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు
- భవనాల నిర్మాణంపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-గండిపేట్
ఆత్మగౌరవ భవనాలను వేంటనే పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావ్, తలసాని శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలకర్ అన్నారు. గండిపేట్ మండలం కోకాపేట్లో అరెకటిక కుల సంఘం భవనానికి మంగళవారం మంత్రులు శంకుస్థాపన చేశారు. ఆత్మగౌరవ సముదాయాల భవనాలను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మంత్రులు మాట్లాడు తూ.. రాష్ట్ర సర్కారు ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న కుల సంఘాల భవనాలను త్వరలో పూర్తి చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసు కోవాలని ఆధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని కు లాలను గౌరవించేందుకు కేసీఆర్ సర్కారు కుల సంఘాల భవనాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. దేశంల్లో ఎక్కడ లేని విధంగా కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. కుర్మ, యాదవ భవనాలను త్వరలోనే ప్రారంభిం చుకుం టామన్నారు. ముదిరాజు భవనాలను త్వరలో పూర్తి చేయా లని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవనాలను సీఎం కేసీ ఆర్తో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఈ కార్యక్రమంలో నార్సింగి ఛైర్పర్సన్ రేఖాయాద గిరి, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, అధికారులు, కుల సంఘాల రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పాల్గొన్నారు.