Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని
- నేడు టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
- విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు షెడ్యూలు ప్రారంభమైన తరువాత ఇతర జిల్లాల నుంచి సెక్రటేరి యట్ బదిలీల ఆర్డర్‌ను రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. సెక్రటేరియట్ బదిలీలను నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు మంగళవారం అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గాలయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్‌నాయక్, వెంకటప్పలు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు నేరుగా ఉత్తర్వులు తీసుకొని దాదాపుగా ఇప్పటివరకు 90కిపైగా ఉపాధ్యా యులు వచ్చారన్నారు. ఇది జిల్లాలోని ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులకు రిక్రూట్మెంట్లో పోస్టులు ఖాళీ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయాన్ని నిలువరించాలి, అందుకు తక్షణమే ఇతర జిల్లాలు, జోన్ల నుంచి వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి జిల్లాకు జరిగిన నష్టాన్ని నివారించాలని, వందలాది ఉపాధ్యాయులతో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నా అధిక సంఖ్యలో ఉపాధ్యాయుల పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.