Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొబైల్ సిరీస్ ప్రారంభం
- మార్కెట్లోకి విడుదల చేసిన భారతదేశ ప్రొడక్షన్ సీఈవో ఆకాష్ గుప్తా
నవతెలంగాణ-మియాపూర్
సామ్సంగ్ ఎస్ 23 సిరీస్ మోడల్ మొబైల్‌ను హైదరాబాద్‌లోని హెచ్ ఐసీసీలో భారత దేశ ప్రొడక్షన్ సీఈఓ ఆకాష్ గుప్తా మంగళవారం లాంఛ నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి 24 గంటల నుంచి సాంసంగ్ గెలాక్సీ దేశంలోనే అత్యంత ఫ్రీ లాంచింగ్ మొబైల్ ఫోన్ సామ్సంగ్ ఎస్ 23 మొబైల్ నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ మొబైల్ అత్యంత లైటింగ్ ఉన్న సమయంలో కూడా ఫోటో క్లారిటీగా ఉంటుందని వాటితో పాటు రంగురంగుల లైటింగ్‌తో పాటు రాత్రి సమయంలో పూర్తిగా హెచ్డీ క్వాలిటీలో ఫోటో వీడియోలు వస్తాయని తెలిపారు. చాలా రకాల మొబైల్స్‌లో రాత్రి సమయంలో కానీ ఇతర లైటింగ్ ప్రదేశాలలో ఫోటో క్లారిటీ లేకుండా ఉంటాయని కానీ ఈ సిరీస్‌లో ఉన్న ప్రత్యేకత ఫోటో క్లారిటీ రావడంలేదని గుర్తు చేశారు. భారతదేశం లాంటి యువత ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ప్రధానంగా గేమింగ్‌లో సైతం అత్యంత వేగంగా గేమ్స్ ఆడుకోవడానికి ఈ మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మొబైల్‌తో పాటు మూడు రకాల లాప్‌టాప్‌లు కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. https://www.samsung.com/in/live_offers సైట్ ద్వారా వినియోగదారులు మొబైల్స్ ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు.