Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి, పదోన్నతుల కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు. రాష్ట్ర పండిత్ పీఈటీ పిలుపు మేరకు మాడ్గుల మండలంలోని నాగిళ్ల గ్రామంలో భాషా పండితుల సమ స్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన మంగళవారం ఏడోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీర్ భాషా పండితులకు ఇచ్చిన హామీని నెరవేర్చి, ఈ పదోన్నతుల షెడ్యూల్లోనే పదోన్న తులు కల్పించాలని కోరారు. పాఠశాల తెలుగు, హిందీ, పీఈటీ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. వారికి తోటి ఉపాధ్యాయునిరాలు, ఉపాధ్యాయులు మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటస్వామి (హిందీ), లక్ష్మయ్య (తెలుగు), శారద (హిందీ), నర్సింహారావు (పిఈటి) ఉపాధ్యాయులు పాల్గొన్నారు.