Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి
- మృతి చెందిన జంగయ్య కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం
నవతెలంగాణ-మంచాల
రైతులకు పంటలు పండించేందుకు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తూ, వ్యవసాయ రంగాన్ని పండుగ వాతావరణంలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ప్రగతి నివేదన యాత్ర మంగళవారం 17వ రోజుకూ చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితం యాచారం మండల గడ్డంమల్లయ్యగూడెంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన జంగయ్య కుటుంబానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రూ.5లక్షలు ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. గత ఏడాది కాలంలో ఆరుట్ల గ్రామానికి రూ.14.21 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. నివేదన యాత్ర సందర్భంగా కూడా సీసీరోడ్లు, అండర్ డ్రయినేజీ పనుల కోసం రూ. 5 లక్షలు కేటాయించడం జరిగిందన్నారున. త్వరలోనే ఆరుట్లలో నెలకొన్న ప్రభుత్వ భూముల, అసైన్డ్ భూముల, సీలింగ్ భూముల, ఇనామ్ భూముల సమస్యలు పరిష్కారం చేయనున్నట్టు చెప్పారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.3 లక్షలు అందజేస్తుందన్నారు. సోమవారం రాత్రి చెన్నరెడ్డిగూడలో, ఆరుట్ల గ్రామంలో ప్రగతి నివేదన యాత్ర సందర్భంగా గ్రామంలో తిరిగి ప్రజలను కలిసి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించినట్టు తెలిపారు. ప్రజలు కూడా తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, బి ఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేష్, కాట్రోత్ బహదూర్, ఆరుట్ల గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు పున్నాము రాము, బైకని మహేందర్ యాదవ్, చెన్న రెడ్డి గూడ అద్యక్షులు బెల్లీ గోపాల్, పీఏసీఎస్ చైర్మెన్ మాజీ చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కందాల శ్రీశైలం, సర్పంచ్ పల్లాటి బాల్‌రాజ్, ఎంపీటీసీలు కావలి శ్రీనివాస్, పేశరి గాయాల సుకన్య శేకర్ రెడ్డి, ఏఎంసి డైరక్టర్ ఎండీ జానీ పాషా,యువజన విభాగం మండల అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్ గుప్త, గంట విజరు,ఎస్సీ సెల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నల్ల ప్రభాకర్, మంకు వినోద్ కుమార్, యువజన విభాగం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చింతక్రింది విరిష్, విద్యార్థి విభాగం మండల అధ్యక్ష,కార్యదర్శులు బొట్టు ప్రవీణ్ కుమార్, ఆవుల ప్రశాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు..