Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు,
- స్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షలు ఇవ్వాలి
- టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-మంచాల
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ, నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అందజేస్తామని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ తెలంగాణ అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండల పరిధిలోని తాళ్ళ పల్లిగూడ, చిత్తాపూర్ గ్రామాల్లో 'హత్ సే హత్ జోడో' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'హత్ సే హత్ జోడో' కార్యాక్రమానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు కార్యకర్తలందరూ ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండాలా ధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, సీనియర్ నాయ కులు వింజమూరి ప్రేమకార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మునికుంట్ల సంతోష్ కుమార్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెస ిడెంట్ ఏర్పుల రాజు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు ఎడమ నరేందర్రెడ్డి, ఉపాధక్షులు పల్లాటి జయనందం, మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండీ వాజిద్బారు, ఏసీఎస్ డైరక్టర్ వేదిరే హనుమంతు రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కాస గణేష్, మండల , జిల్లా నాయకులు చీమల జంగయ్య, చేతాల సంజీవ, గ్రామాధ్యక్షులు ఏర్పుల నర్సింహా, జిలమొనీ సత్తయ్య, దేబ్బటి విష్ణుగౌడ్, సుంకం రాజు, ముత్యాల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.