Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ సంస్థ చేపట్టిన బడులు పిల్లలు ఉపాధ్యాయుల పరంగా చేసిన కృషి బాగుందనీ యంగ్ లైఫ్ రీసర్చ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు రేణు సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ నేషనల్ ఎడ్యు కషన్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇండియా రీనా అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండలంలో పని చేస్తున్న బాల కార్మిక విమోచన వేదిక రాష్ట్రపతి ప్రతినిధులు పాపగారి ఆశీర్వాదం, పి. రఘునందన్ రెడ్డి, వనజ, బాల రాజ్, ఉపాధ్యాయులతో పాటు ఎంఏ ప్రతినిధి భాస్కర్, దొంతాన్పల్లి సర్పంచ్ అశ్విని సుధాకర్, ఆశీర్వాదం, మంగమ్మా, సబితా ఎంవీఎఫ్ శంకర్పల్లి బృందం వారితో దొంతంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం పొద్దుటూరు గ్రామ కిషోర్ బాలికలతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి చదువుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేషన్ చేసిన కృషిని ప్రతి నిధులు అభినందించారు.2015 సంవత్సరంలో బాలికల్లో వచ్చిన మార్పులను తెలుసుకునేందుకు న్యూఢిల్లీ యంగ్ లైఫ్ రిసార్ట్స్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగిందన్నారు.