Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
- ఇముల్‌నర్వ నుంచి రెండోవ రోజు ప్రారంభమైన పాదయాత్ర
నవతెలంగాణ-కొత్తూరు
తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. మండలంలోని ఇముల్ నర్వ గ్రామంలో రెండోవ రోజూ కొనసాగిన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాత్ సే హాత్ జోడో కార్యక్రమంతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, పోలీసుల చేత తమ యాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని సవాల్ విసిరారు. కాంగ్రెస్ యాత్రకు సంబంధించి స్ధానిక పోలీసులు అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినట్టు వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకు తమపై పోలీసులతో కేసులు పెట్టించడానికి, భయపెట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కేసులు పెడితే భయపడమని తమకు ప్రజల అండదండలు ఉన్నాయంటూ హెచ్చరించారు. వేలాది మందితో గ్రామగ్రామాన ఇంటింటికీ తిరిగి రాహుల్ గాంధీ సందేశాన్ని అందజేస్తానని తెలిపారు. తన యాత్ర నియోజక వర్గంలో ప్రభంజనం సృష్టించబోతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజల అండదండలు ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గంలో పేద ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అడుగడుగునా మోసాగిస్తుందనీ,దీంతో ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ఆశా భావం వ్యక్తం చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభింస్తుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాలతో చిందులు వేశారు.ఈ యాత్ర కొత్తూరు మండలంతో పాటు నందిగామ మండలం మీదుగా కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరు, నందిగామ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు గొంగళ్ల హరినాథ్ రెడ్డి, జంగ నర్సింలు, నాయకులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాబర్ అలీ ఖాన్, అగీరు రవికుమార్ గుప్తా, కొంకళ్ళ చెన్నయ్య, అందే మోహన్, రఘు, బాలరాజు గౌడ్, కొమ్ము కృష్ణ, దేపల్లి కుమార్‌గౌడ్, చంద్రపాల్ రెడ్డి, దెవగిరి అశోక్, వీరమోని దేవేందర్ ముదిరాజ్, ప్రవీణ్ రెడ్డి, కోడిచెర్ల కృష్ణ, సాయి, గంగమోని సత్తయ్య, వన్నాడ శివ శంకర్ గౌడ్, చించేటి కృష్ణ గౌడ్, రాందాస్ నాయక్ లతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.