Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడే పిల్లలకు న్యాయం
- వికారాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె. సుదర్శన్
- బాలల న్యాయ మండలి కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం యెన్నెపల్లిలోని బాల రక్షాభవన్ కార్యాలయంలో నూతనం గా జువైనల్ జస్టిస్ బోర్డ్ (బాలల న్యాయమండలి) వికారా బాద్ జిల్లా డిస్టిక్ జడ్జి కె. సుదర్శన్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. శ్రీకాంత్‌తో కలిసి ప్రారంభించారు. ఇంతకుముందు జువైనల్ జస్టిస్ బోర్డు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతూ ఉండేదని నూతన జిల్లాలను ప్రారంభించిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాకూ ఒక జువైనల్ జస్టిస్ జస్టిస్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందు లో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లాలో జువైనల్ జ స్టిస్ బోర్డ్‌ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వి కారాబాద్ జిల్లా డిస్టిక్ కోర్టు జడ్జి కె. సుదర్శన్ మాట్లా డుతూ జువెనైల్ జస్టిస్ బోర్డు (పిల్లల సంరక్షణ, రక్షణ ) చట్టం 2000 (2015లో సవరించబడింది) దానిలో భా గంగా నేరారోపణ లేదా చట్టంతో నిర్బంధించబడిన పిల్లల ను జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు ప్రవేశపెడతరని ఈ చ ట్టం, క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ నిబంధనల ప్రకారం పిల్ల లను సాధారణ క్రిమినల్ కోర్టుకు తీసుకెళ్లకూడదని ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరుస్తారన్నారు. పిల్లలను వారి నేర కార్యకలాపాలకు దోషిగా నిందించడం కానీ వారి చర్యలను అర్థం చేసుకోవడానికి, వారిని భవిష్యత్తులో బాల లను నేర కార్యకలాపాల నుండి బయటపడేందుకు నైపు ణ్యమైన కోర్సులలో శిక్షణ ఇప్పించి వారిని భావి భారత పౌరులుగా తయారు చేయాలన్నారు. బాలల న్యాయమం డలి ద్వారా పిల్లలకు సంబంధించిన కేసులను సత్వర పరిష్కారానికి జువైనల్ జస్టిస్ బోర్డ్ దోహదపడుతుందని బాలల కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ చట్టాన్ని లోబడి పని చేయవలసి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయు తంగా ప్రవర్తించినప్పుడే బాలలకు న్యాయం చేయగలు గుతామని తెలిపారు. ఇంతకుముందు చట్టాన్ని జువైనల్ కాన్ఫ్లిక్ట్ విత్లా అని పిలిచే వాళ్ళము కానీ ఇప్పుడు చైల్డ్ కాన్ఫిట్ విత్ లాగా పిలుస్తుందని ఎవరైతే నేరారోపణ గురై న పిల్లలకు ప్రత్యేక పునరావాసం కల్పించాలని వారికి ప్రత్యేక శిక్షణను ఇవ్వవలసి ఉంటుందని వివిధ కారణా లవల్ల కొంతమంది తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలు పోషణ భారమై పిల్లలు పారవేయడం లేదా వదిలివేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి పిల్లలకు ప్రభుత్వం తరఫున శిశు గృహహౌమ్ ఏర్పాటు చేసుకుంటుందన్నా రు. కార్యక్రమంలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ డిపిసీ తల్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి కేతా వత్ లలిత కుమారి, డిటిసి అడిషనల్ ఎస్పీ మురళీధర్, డిస్టిక్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఎస్ గౌతమి, బార్ అసోసి యేషన్ అధ్యక్షులు కె.మాధవ రెడ్డి, జువైనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ జి వాసు, డిఎస్పి బివి.సత్యనారాయణ, బాల రక్షభవన్ కోఆర్డినేటర్ టి.శ్రీలక్ష్మి, వికారాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ టంగుటూరి శ్రీను, లీగల్ ఆఫీసర్ నరేష్ కుమార్, న్యాయవాదులు బాలయ్య, నాగరాజు, రామ చందర్ డిసిపి యు సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.