Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల సంఘం అధ్యక్షులు కే.రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
పల్లె ప్రగతిపై వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ బుధ వారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన తీరు బా గుందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కె. రాజి రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం దోమ తహసీల్దార్ కా ర్యాలయంలో జరిగిన వీసీలో కలెక్టర్ మండల టీంకు సూ చించిన పలు విషయాల్లో గ్రామపంచాయతీల పై కలెక్టర్ నారాయణ రెడ్డి పంచాయతీల పాత్ర ఉపాధి హామీ పథకం ఇంపుల్యూమెంట్తో గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ చెప్పిన విషయాలపై ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్య దర్శి సర్పంచుల సహకారం తీసుకుని పనులు చేస్తే నిజం గా గ్రామాల్లో ఎలాంటి సమస్యలూ ఉండవని చెప్పారు. గ్రామకంఠం భూమిపై కూడా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ చెప్పారని మండల స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు టీంగా ఏర్పడి పనులు చేయాలనీ చెప్ప డంతో అభివృద్ధి ప్రజల సౌకర్యాలు తీరుతాయన్న నమ్మకం కలిగిందన్నారు. పల్లె ప్రగతిపై కలెక్టర్ స్పష్టమైన సూచ నలు చేసారన్నారు. అభివృద్ధికి విరోధం కలిగిస్తే పోలీస్ సపోర్ట్ తీసుకోవడం కోసం వీసీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆహ్వానించి జిల్లా ఎస్పీతో మాట్లాడించడంతో గ్రామీ ణ స్థాయిలో ఉండే కొందరి సర్పంచ్లకు మనోదైర్యం ఇచ్చిన ట్టు అయిందని గ్రామాల్లో ఉన్న రాజకీయ కారణాలతో కొన్ని పనులు చేయడం లేదని గతంలో పలువురు సర్పం చులు పేర్కొన్న విషయం గుర్తు చేస్తూ గ్రామీణ ప్రాంతపై స్పష్టమైనా అవగాహన కలెక్టర్కు కలిగి ఉందని వీసీలో చేర్చిచిన్న విషయంపై అర్థం అవుతుందని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లె ప్రగతి ప్రత్యేక అధికారి కోటయ్య, ఎస్ఐ విశ్వజన్, ఎంపీడీఓ జయరాం, విద్యా ధికారి హరిచేందర్, ఎంపీవో సురేష్, సర్పంచులు, పంచా యతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.