Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
ఆరోగ్యమే మహాభాగ్యం అని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవా లయం ఫంక్షన్ హాల్లో ఈ నెల 9 నుండి ప్రారంభమ య్యే ధ్యానాసన యోగ శిక్షణా తరగతుల ఏర్పాట్లను పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి పరిశీ లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా అనారోగ్యానికి గురవు తున్నారని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగ చే యాలన్నారు. తద్వారా మానసికంగా దృఢంగా ఉంటామ ని తెలిపారు. ఈ నెల 9 నుండి శివానంద ఆచార్యులచే గురువారం సాయంత్రం 6 గంటలకు యోగా శిక్షణ తరగ తులు ప్రారంభమవుతాయని తెలిపారు. యోగా శిక్షణ తర గతులు పది రోజులపాటు కొనసాగనున్నాయని తెలిపారు. ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 7:30 నిమిషాల వరకు రెండు బ్యాచ్‌లుగా ఈ తరగతులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన వారు కింది నెంబర్లను సంప్రదించాలని 7729996796, 9550727275, 6304250542 సూచించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నాయకులు ఆంజనేయులు, సయ్యద్ పల్లి వెంకట య్య, బల్లాల తదితరులు పాల్గొన్నారు.