Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల సంఘం మండల
- అధ్యక్షులు పినమోని భీమప్ప
నవతెలంగాణ-యాలాల
అంధత్వ నివారణ లక్ష్యంగా రెండో విడత 'కంటి వెలుగు' కార్యక్రమం మండలంలోని అగ్గనూర్ గ్రామంలో బుధవారం రెండో రోజు కొనసాగినట్లు స్థానిక సర్పంచ్, యాలాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన మోని భీమప్ప అన్నారు. ఆయన 'కంటివెలుగు' శిబిరాన్ని దగ్గర నుంచి సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందుచూపు ప్రణాళికతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కంటి వెలుగు శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అగ్గనూర్ పాఠ శాల ఆవరణలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. అగ్గనూర్ జీపి పరి ధి కంటి వెలుగు శిబిరంలో ఇప్పటి వరకు 212 మందికి కంటి పరీక్షలు చేయగా, అందులో అవసరమైన 60 మం దికి కళ్ళ అద్దాలను వైద్య బృందం ఇచ్చారన్నారు. 11మం దికి కళ్ళ ఆపరేషన్ కోసం వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మెహదీపట్నం సరోజినీ ఆస్పత్రికి పంపించారన్నా రు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని డాక్టర్లను నియ మించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమం లో అగ్గనూర్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ యు. వెంకట య్య, వార్డ్ మెంబర్లు, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.