Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్టర్ సంగన్న, ఎస్ ఓ శైలజ
నవతెలంగాణ-మర్పల్లి
నేటి సమాజంలో బాలికలు స్వయం రక్షణ కోసం కరా టే విద్య నేర్చుకోవాలని మర్పల్లి సీనియర్ కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ 4వ డాన్ సంగన్న, కస్తూర్బా బాలికల ఆశ్రమం పాఠశాల ఎస్ఓ శైలజలు అన్నారు. బుధవారం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిలకు కరాటే శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ప్రభుత్వం జనవరి 24 నుండి ఫిబ్రవరి 23 వరకు 30 రోజులపాటు రాణీ లక్ష్మీబాయి ఆత్మ రక్ష ప్రశిక్షణ్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం ఫర్గర్ల్స్ పథకం కింద వికా రాబాద్ జిల్లాలో 205 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి కరాటే శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నా రు. మర్పల్లి మండలంలో11 పాఠశాలలు ఎంపిక చేశారని అందులో తనతోపాటు కరాటే మాస్టర్లు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. గత 20 రోజులుగా నిర్వహిస్తున్న కరా టే తరగతుల్లో బాలికలు ఎంతో ప్రావీణ్యత కనబరుస్తున్నా రన్నారు. బాలికలు చదువుతోపాటు స్వయం రక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టి కరాటేలో ప్రావీణ్యత పొందాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మధునాచారి, శ్రీశైలం, హలీంలు మాట్లాడుతూ జిల్లా విద్యాధికారి ఆదేశానుసారం బాలికల కు కరాటే తరగతులు నిర్వహిస్తా మని సీనియర్ మాస్టర్ సంగన్న బాలికలకు కరాటే తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు.