Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
వ్యవసాయ రంగం భారతదేశానికి వెన్నెముక లాంటిదని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో అభివృద్ధి పరచాలన్నారు. రిజిస్ట్రార్ ఎస్. సుధీర్ కుమార్ మాట్లాడుతూ అన్ని కళాశాలలో క్రీడలకు సంబంధించిన వసతులు మెరుగుపరుస్తూ, బాలికలకు ప్రత్యేకమైన జిమ్ వసతిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ పోటీలలో వివిధ కళాశాలలకు చెందిన 570 మంది విద్యార్థి, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా హౌరాహౌరీగా సాగిన బాలుర క్రికెట్ క్రీడ చివరి ఆటలో రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు గెలుపొందగా, జగిత్యాల కళాశాల విద్యార్థులు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.లలిత కళలు, సాంస్కృతిక, సాహిత్య,సృజనాత్మక పోటీలలో కమ్యూనిటీ సైన్స్ కళాశాల, సైఫాబాద్ విద్యార్థిని విద్యార్థులు మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ బాలికల విభాగంలో ఛాంపియన్ షిప్ను వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట దక్కించుకోగా, బాలుర విభాగంలో వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ కైవసం చేసుకుంది. మొత్తంగా రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థి, విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ కైవసం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ వి. అనిత, డాక్టర్ జె. సత్యనారాయణ, డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ జమునారాణి, కళాశాల అసోసియేట్ డీన్ సి. నరేంద్రరెడ్డి, యూనివర్సిటీ అబ్జార్వర్ డాక్టర్ బి.విద్యాసాగర్, డాక్టర్ వి. రవీందర్ నాయక్ పాల్గొన్నారు.