Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ, టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి
గురుకుల పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యార్థులు లక్ష్య సాధనతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ, టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మర్రి నిరంజన్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌ను ఆ ఫౌండేషన్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను తమ ఫౌండేషన్ ద్వారా ప్రతీ ఏడాది అందజేయడం జరుగుతుందన్నారు. విద్యతోనే అభివద్ధి సాధ్యమని ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి పెంచిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరును తెచ్చిపెట్టాలని విద్యార్థులను ఆకాంక్షించారు. ఈ రెండు నెలలు చాలా కీలకమని విద్యార్థులు దిశా, నిర్దేశంతో చదవాలని అన్నారు. కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. నియోజకవర్గంలో స్టడీ మెటీరియల్ ఒక ఉద్యమంలా సాగుతుందని చెప్పారు. 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తగిన ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా తమ ఫౌండేషన్ ముందుంటుదని తెలిపారు. అనంతరం విద్యార్థులు మర్రి నిరంజన్ రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మాన్నార్ యువసేన నాయకులు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.